మానవ హక్కుల కౌన్సిల్ సభ్యుల సమావేశం రాష్ట్ర కార్యలయం లో రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అధ్వర్యంలో జరిగింది. గత సంవత్సర కాలంగా ప్రొ.వై.సత్యనారాయణ గారు ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షులు పి.జగన్మోహన్ రావు గారి సహకారంతో విస్తృతంగా మానవ హక్కుల కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులకు కు శిక్షణ నిర్వహించామని శ్యామ్ ప్రసాద్ అన్నారు. గత సంవత్సర కాలంగా మానవ హక్కుల కౌన్సిల్ లో సభ్యులుగా ఉత్సాహంగా సేవాభావం ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్దులు, యువత, ఉపాధ్యాయులు, మహిళలు తమ సదస్సులలో పాల్గొన్నారని తెలిపారు.
రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు ఎస్. వి.రమణ ఆద్వర్యంలో సభ్యులకు వచ్చే నెల ఏప్రిల్ 14, ఆదివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం డాబాగార్డెన్స్, విశాఖపట్నంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని మానవ హక్కులు పరిరక్షణ కోసం అంకిత భావంతో తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్న సభ్యులకు ప్రాధాన్యమిచ్చి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తమ సంస్థ నుండి సిఫార్సు చేస్తామని శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘనలను గుర్తించి భాదితులకు న్యాయం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లా నుండి టి.కరుణాకర్, చిత్తూరు జిల్లా నుండి ఆర్.అభిషేక్ రెడ్డి తదితరులు శ్రమిస్తున్నారని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం చట్టాలపై అవగాహనతో ఉన్న సభ్యులతో రాష్ట్ర మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యవర్గాన్నిఎంపిక చేస్తామని జూలై 12, 2024 వ తేదీన 25 వ రజతోత్సవాన్ని విజయవాడలో నిర్వహిస్తామని ఎస్ వి రమణ తెలిపారు