ఆసియా దేశాలలో మానవహక్కులు అమలవుతున్న తీరుపై ఐక్య రాజ్య సమితి మానవహక్కుల మండలి ఫిబ్రవరి 13, 2023 న ఖాట్మాండు నేపాల్ లో వివిధ మానవహక్కుల స్వచ్ఛంద సంస్థల అభిప్రాయ సేకరణ చేపడుతుందని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు… రామ్ నగర్ లో గల మానవహక్కుల కౌన్సిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..జాతీయ మానవహక్కుల కమిషన్ నేపాల్ దేశంలో, నిర్వహిస్తున్న సదస్సులో భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, దేశాల నుండి మానవహక్కుల ఉల్లంఘనలు, చట్టాలు అమలవుతున్న తీరు, వివిధ దేశాలలో మానవహక్కుల కమిషనుల పనితీరు, బాధితులను లభిస్తున్న ఉపశమనం, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినవారికి విధిస్తున్న జరిమానాలు, శిక్షలు తదితర అంశాలు చర్చిస్తారని తెలిపారు… మానవ హక్కుల పరిరక్షణ చట్టం- 1993 కంటితుడుపుగా ఉందని ఈ చట్టం పై పాలకులకు ప్రజాప్రతినిధులకు అవగాహన లేదని శ్యామ్ ప్రసాద్ ఆరోపించారు. భారత దేశంలో రాజ్యాంగం ఆర్టికల్ 21 లో పేర్కొన్న స్విచ్చగా గౌరవప్రదంగా జీవించే హక్కు పౌరులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు… అనంతరం
మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు ఎం సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ..హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, పీపుల్స్ వాచ్, కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇన్ఫియేటివ్ సంస్థలను భారతదేశం నుండి ఆహ్వానం అందుకున్నాయని తెలిపారు..
పార్లమెంటు రూపొందించిన చట్టాలు పటిష్టంగా లేవని అవినీతి, అక్రమాలు కొనసాగుతున్నందున పౌరుల హక్కులకు భంగం కలుగుతున్నదని తమ నివేదిక రూపొందిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు బివి హిన్ శ్రీరాములు, మార్టిన్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.